Nara Lokesh On Announced His Family Assets | Oneindia Telugu

2017-12-08 963

AP CM Nara Chandrababu Naidu son and IT minister Nara Lokesh on friday announced his family assets.

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు, ఐటీ మంత్రి నారా లోకేష్ శుక్రవారం తమ కుటుంబం ఆస్తులను ప్రకటించారు. వరుసగా తాము తమ ఆస్తులను ప్రకటిస్తున్నట్లు తెలిపారు. దేశంలో మరే కుటుంబం కూడా ఇలా ప్రతి ఏటా ఆస్తులను కట్టలేదన్నారు. తన తండ్రి చంద్రబాబు ఆస్తుల్లో పెద్దగా మార్పులు లేవని చెప్పారు. హైదరాబాదులో ఇంటి నిర్మాణానికి రూ.4 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. చంద్రబాబుకు రూ.3 కోట్ల అప్పులున్నాయన్నారు. తమ ఆస్తులు మార్కెట్ విలువ ప్రకారం మారుతుంటాయని చెప్పారు.
తమ కుటుంబానికి ప్రధాన ఆదాయ వనరు హెరిటేజ్ అని చెప్పారు. పద్ధతి ప్రకారం వ్యాపారం చేయడం తప్పు కాదన్నారు. తమ కుటుంబం ఎనిమిదేళ్లుగా ఆస్తులను ప్రకటిస్తుందన్నారు.తన తండ్రి చంద్రబాబు ఆస్తుల్లో పెద్దగా తేడాలు లేవని, చంద్రబాబు పేరిట రూ.3.58 కోట్ల అప్పులు ఉన్నట్లు తెలిపారు. చంద్రబాబు నికర ఆస్తులు రూ.2.53 కోట్లుగా ఉందని చెప్పారు. ప్రావిడెంట్ ఫండ్ రూ.30 లక్షలు పెరిగిందని చెప్పారు.